KTR: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ.26,500 కోట్లు ఎగ్గొట్టింది 2 d ago
TG : గత ప్రభుత్వ హయాంలో రైతుబంధు పంపిణీలో రూ. 22 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నేతలు.. ఆ డబ్బు ఎక్కడికి వెళ్లిందో చెప్పాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. పత్తి, కంది, చెరకుకు రెండో పంట ఉండదని.. అయినా రైతుబంధు ఇచ్చామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ. 26,500 కోట్లు ఎగ్గొట్టిందని విమర్శించారు. రైతుబంధు పేరిట ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. రైతును రాజును చేస్తామని ఎన్నికల ముందు చెప్పారన్నారు. రైతు డిక్లరేషన్ పేరుతో చాలా హమీలు ఇచ్చారని చెప్పారు. ప్రజా పాలనలో 1.6 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. రైతు శాసించాలని కేసీఆర్ అంటే.. యాచించాలని కాంగ్రెస్ అంటోందని మండిపడ్డారు. వానాకాలంలో ఎగ్గొట్టిన రైతుబంధు కూడా ఇవ్వాల్సిందేనని అడిగారు. రైతు రుణమాఫీ చేశామని చెబుతున్నారు.. గ్రామాల వారీగా రుణమాఫీ జాబితాలు పెట్టాలని వెల్లడించారు. రైతు భరోసా ఎవరికి ఇస్తారో స్పష్టంగా చెప్పాలి" అని కేటీఆర్ పేర్కొన్నారు.